
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇన్ని రోజులు అధికార పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎంతో ఇప్పుడు హస్తం దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ నేతలు గంట పాటు భేటీ కావటమే అందుకు నిదర్శనం. అక్బరుద్దీన్‌తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అయితే.. ఈసారి ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ మొన్న అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ కావటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ విషయంపై మాత్రం కాంగ్రెస్ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు.
Read Also : తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
అక్బరుద్దీన్‌తో సాధారణంగానే భేటీ అయ్యామన్నారు. ఐదు పది నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నామని.. సుదీర్ఘంగా ఏం మాట్లాడుకోలేదని చెప్తున్నారు. కలిసి చాలా రోజులైనందు వల్లే కలిసి మాట్లాడామని.. అందులో రాజకీయపరమైన విషయాలేవి చర్చకుకు రాలేదంటూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దాటేసే ప్రయత్నం చేశారు. కాగా.. జగ్గారెడ్డి మాత్రం కుండబద్దలుకొట్టినట్టుగానే స్పందించారు. ఎంఐఎంతో భేటీ అయితే తప్పేంటంటూ బదులిచ్చారు. ఎంఐఎం కూడా సెక్యూలరే అంటుంది కాబట్టి మాట్లాడమని చెప్పేశారు. ఇదిలా ఉంటే.. ఎంఐఎంతో మళ్లీ జట్టు కట్టే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మాత్రం నేతలు సమాధానం చెప్పకుండానే దాటేశారు.
Also Read : బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
అయితే.. ప్రస్తుతానికి పొత్తు ప్రస్తావనే లేదంటున్న నేతలు.. ఒకవేళ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. ఆ విషయం తమ చేతిలోలేదని.. దానిపై పెద్దలు నిర్ణయం తీసుకుంటారంటూ చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన కాంగ్రెస్.. ఈసారి కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తోందా.. అన్న చర్చ శ్రేణుల్లో మొదలైంది. అక్బరుద్దీన్ అసెంబ్లీలో గట్టిగానే గొంతు వినిపించటంతో.. అధికార పక్షంపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో.. కనీసం ఇలా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటేనన్నా ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- వామ్మో విమానంలో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు.. వీడియో వైరల్
- రైతు బజారా??… చోరీ బజారా….??…. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లే ఈ అగంతకుల టార్గెట్…!!
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
- ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
One Comment