
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఇళ్లులేని నిరుపేదలకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సొంత జాగా (స్థలం) కలిగి ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయనుంది. తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని మెుత్తం 119 నియోజవర్గాల్లో నియోజవర్గానికి రూ. 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారు ఇళ్లు కట్టుకోవటానికి ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కోటాలో మరో 25 వేల మందికి ఆర్థిక సాయం చేయనన్నట్లు చెప్పారు. మెుత్తం 2.63 లక్షల మందికి 7,890 కోట్లు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్లకు బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయింపులు చేశారు. తెలంగాణలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Read Also : ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకంకు బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి దళితబంధు ఇవ్వనున్నారు. 118 నియోజకవర్గాలకు కలిపి రూ.12,980 కోట్లు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఒక్కొ దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నారు. దళితబంధు గురించి ప్రతీ సభలో బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతుండటంతో.. ఈ పథకంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దళితబంధు లాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదని బహిరంగ సభలలో కేసీఆర్ చెబుతున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.
Also Read : 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
వచ్చే ఎన్నికల కోసం దళితబంధు పథకాన్ని కేసీఆర్ బాగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెబుతున్నారు. గతంలో నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే దళితబంధు ఇవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్యను ప్రభుత్వం మరింత పెంచింది. విడతల వారీగా రాష్ట్రంలోని దళిత కుటుంబాలందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణ బడ్జెట్ మొత్తం రూ.2,90,396 కోట్లు కాగా.. ఇందులో గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,246 కోట్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి :
- నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం
- వచ్చే ఎన్నికల్లో 50 స్థానాలలో పోటీ… అక్బరుద్ధీన్ సంచలన ప్రకటన
- విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
- పద్మభూషన్ అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని వాణి జయరాం కన్నుమూత…
- జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
3 Comments