
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రకృతి కన్నెర్ర జేస్తే ఏమవుతుందో టర్కీ,, సిరియాలో సంభవించిన భూకంపమే నిదర్శనం. సోమవారం తెల్లవారుజామున ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టం కాగా.. పలు నగరాలు మరుభూమిగా మారాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 560 మందికిపైగా మృతి చెందగా.. వేలాది సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జనం గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం భారీగా ఉంది. వందలాది మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read Also : రైతు బజారా??… చోరీ బజారా….??…. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లే ఈ అగంతకుల టార్గెట్…!!
ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని.. ‘‘భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం బాధాకరం.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను… క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది.. ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా ఇరు దేశాలకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. టర్కీ కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో తొలి భూకంపం చోటుచేసుకుంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల్లో 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదయ్యింది.
Also Read : నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
మొత్తం 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 250 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 47 మంది మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అటు, టర్కీలో ఇప్పటి వరకూ 290 మంది చనిపోయినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు పౌత్ ఒక్టే తెలిపారు. అలాగే, మరో 2,300 మంది గాయపడ్డారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. శిథిలాల కింద వందలాది మంది ఇంకా చిక్కుకున్నారని పేర్కొన్నారు. విపరీతమైన చలి, మంచు వల్ల సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. రహదారులపై మంచు పేరుకుపోయింది.
ఇవి కూడా చదవండి :
- ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
- నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం
- 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
- విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
- జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు