
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. నెల రోజుల్లో వాయిదా పడటం ఇది మూడోసారి. మరోసారి మేయర్ ఎన్నిక విషయంలో ఆప్ కి చుక్కెదురైంది. ఢిల్లీ మున్సిపల్ హౌస్లో బీజేపీ, ఆప్ సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో సభ వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సోమవారం సభ్యులంతా సమావేశమయ్యారు. నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతివ్వడంపై దుమారం రేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957 ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేయవచ్చని ఆల్డర్ మెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యశర్మ తెలిపారు.
Read Also : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
చట్టం ప్రకారం 25 ఏళ్లు పైబడిన 10 మందిని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కార్పొరేషన్ కు నామినేట్ చేయవచ్చు.. అయితే 10 మంది బీజేపీ సభ్యులను ఆల్డర్ మెన్ గా ఎన్నుకోవడంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ నిబంధనలను ఉల్లంఘించారని ఆప్ ఆందోళనకు దిగింది. బీజేపీ, ఆప్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపాలిటీలో మొత్తం 250 స్థానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లను గెలుచుకుంది. బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో గెలిచింది. దీంతో మేయర్ పీఠం ఆప్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. అయితే ఎంసీడీ ఫలితాలు వచ్చి రెండు నెలలైనా మేయర్ ఎన్నిక పూర్తి కాలేదు. ఇప్పటికే జనవరి 6 ఆ తర్వాత 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో బీజేపీ, ఆప్ మధ్య తలెత్తిన వివాదాలతో మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. సోమవారం కూడా మేయర్ ఎన్నిక జరగకుండానే వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి :
- వామ్మో విమానంలో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు.. వీడియో వైరల్
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
One Comment