
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తన వ్యాఖ్యల కారణంగా బాలకృష్ణ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలె తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం బాలయ్య ఇచ్చిన వివరణతో సద్దుమణిగాయి. ప్రస్తుతం మరోసారి బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. నర్సుల వివాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నర్సులంటే తనకు గౌరవమంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అధికారిక సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్యప్రచారాన్ని ఖండిస్తున్నానని బాలయ్య అన్నారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. రోగులకు సేవలందించే సోదరీమణులంటే తనకెంతో గౌరవమన్నారు.
Read Also : మూడవసారి వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక… ఆప్, బీజేపీ మధ్య వాగ్వాదం
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానన్న బాలయ్య.. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి వారి ప్రాణాలు నిలిపే సోదరీమణులంటే తనకెంతో గౌరవమని చెప్పారు. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నర్సులు పగలనక, రాత్రనక కష్టపడి కరోనా రోగులకు సేవలందించారని అన్నారు. అటువంటి నర్సులను మెచ్చుకొని తీరాలని.. నిజంగా తన మాటలు ఎవరివైనా మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని బాలకృష్ణ చెప్పారు. ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. తనకు బైక్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో తనకు వైద్యం చేసిన నర్సు గురించి ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య మాటలపై నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు గానూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
One Comment