
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. తన ఎనిమిదో ఏటనే ఆమె సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. మద్రాసు క్వీన్స్ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్న వాణీజయరాం కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టారు. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను చక్కగా పాడేవారు.
తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా తదితర 14 భాషల్లో 20వేలకు పైగా పాటలు ఆలపించారు. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ ఎంతకీ తలుపు తీయకపోవడంతో బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా ముఖంపై తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి కనపడినట్లు పనిమనిషి చెప్పారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఎవరో కొట్టినట్లుగా ముఖంపై, నుదురుపై తీవ్ర గాయాలున్నాయని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వాణీజయరాంను ఆసుపత్రికి స్థానికులు, పనిమనిషి కలిసి ఆసుపత్రికి తరలించారు. వాణీ జయరాం ఇంటిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
- అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం… అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
- అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో… ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
- అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కేటిఆర్
- హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం… రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు
One Comment