
క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిధి : కూలీలతో వెళ్తున్న ఓ ఆటో అతివేగంగా వెళ్లి పల్టీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం తాడ్వాయి మండలం నార్లాపూర్ వెళుతుండగా ఆటో అతివేగంగా వచ్చి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 15 మందికి తీవ్ర గాయాలు అయింది. ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కేటిఆర్
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను ప్యాసెంజర్ టీఎస్ 28టీ 2286 నంబర్ గల ఆటోలో తాడ్వాయి మండలం మేడారం సమీపంలో నాట్లు వేయడానికి ఓ డ్రైవర్ కూలీలను తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ ఆటోను అతి వేగంతో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్సీ వద్ద గల మూల మలుపులో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లెబోయిన సునీత, జ్యోతి మృతి చెందగా మరో 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం విధుల్లో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం… రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు
- ఏపీ చలనచిత్ర, నాటక మరియు టివి అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని…
- కేఏ పాల్ శాపం వల్లే సచివాలయం తగలబడిందా?
- ఇంకా విషమంగానే తారకరత్న… విదేశాలకు తరలించే ఛాన్స్
- అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం… ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన కేటిఆర్
One Comment