
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం దగ్గర పెట్రోల్ బాటిళ్లతో హల్‌చల్ చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు.. ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వెళ్లిపోవాలని అభ్యర్థులకు పోలీసులు తెలపగా.. అందుకు వాళ్లు నిరాకరించారు. దీంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులు తరలించారు. ఈవెంట్స్‌లో లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ నిబంధనలపై కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
Read Also : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
తమ విన్నపాలను వినకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్రోల్ బాటిళ్లతో నానా హంగామా చేశారు. డీజీపీ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిళ్లతో తిరుగుతూ కనిపించారు. నిరసనకారుల దగ్గర పెట్రోల్ బాటిళ్లు ఉన్నట్లు గమనించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఈ ఘటనలో ఐదుగురుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌పై తొలి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. రిక్రూట్‌మెంట్ సరిగ్గా జరపడం లేదని అభ్యర్థులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రగతిభవన్‌కు కూడా ముట్టడించగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్… భారీగా చేరుకున్న ఐటీ అధికారులు
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలపై ఇటీవల వివాదం చెలరేగింది. పరీక్షల్లో ఏడు ప్రశ్నలకు బహుళ సమాధానాలు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తించారు. కానీ పోలీస్ నియామక మండలి తాము నిర్ధారించుకున్న ఆన్సర్లకు మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుగా ఇచ్చిన ఏడు ప్రశ్నలకు సంబంధించి అదనంగా మార్కులు కలపాలని కోరారు. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అదనంగా 7 మార్కులు కలపాలని హైకోర్టు నిర్ణయించింది. హైకోర్టులో ఆదేశాలతో పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ మార్కులు కలిపారు.
ఇవి కూడా చదవండి :
- కళాతపస్వీ మరణం పట్ల సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్
- సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సూపర్ గిఫ్ట్.. రాజకీయ వర్గాల్లో సంచలనం
- సీతక్క ఇలాఖా నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
- బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రనికి తీరని ద్రోహం… రేవంత్ రెడ్డి
One Comment