
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దేశానికే ధాన్యాగారంగా మారుతుందని తమిళిసై అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని, గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. ‘రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. రైతు బీమా అందిస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించాం. రైతు పండించే ప్రతీ బియ్యం గింజను కొనుగోలు చేస్తాం. ఎన్నో సవాళ్లను ప్రభుత్వం అధిగమించింది.
Read Also : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్… భారీగా చేరుకున్న ఐటీ అధికారులు
రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. తెలంగాణ ప్రజల తలసారి ఆదాయం మూడింతలు అయ్యింది. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో 41 బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టాం. తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను 310కి పెంచాం’ అని తమిళిసై పేర్కొన్నారు. ‘సివిల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నాం. 12.46 లక్షల ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్ ద్వారా లబ్ధి కల్పించాం. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80వేలకుపైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తున్నాం. 2014 నుంచి 2022 వరకకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం.
Also Read : కళాతపస్వీ మరణం పట్ల సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టాం. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు లభించింది. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణ ఆకర్షించింది. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం ఒక చారిత్రాత్మక అద్భుతం. ఐటీ ఉద్యోగ నియమాకాల్లో 140 శాతం వృద్ధి సాధించాం’ అని గవర్నర్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకపోవడంపై సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్
- సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సూపర్ గిఫ్ట్.. రాజకీయ వర్గాల్లో సంచలనం
- సీతక్క ఇలాఖా నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
- గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు…. దరఖాస్తుకు రేపే చివరి తేదీ
- క్రైమ్ మిర్రర్ దిన పత్రిక నూతన క్యాలండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
One Comment