
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్లు తెలుగు సినీ అభిమానులతో పాటుగా ప్రముఖులు షాక్ అయ్యారు. తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడుగా విశ్వనాధ్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర ఆణిముత్యాల్లో ఒకటైన శంకరాభరణం విడుదలైన రోజు (ఫిబ్రవరి 2)నే ఆయన శివైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన.. హెల్త్ ఇష్యూస్ తీవ్రతరం కావడంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి చేరారు. ఆ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మనను విడిచి వెళ్లిపోయారు.
Read Also : రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్
ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలిసిన వెంటనే ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వెండితెరపై దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడని కొనియాడారు. విశ్వనాథ్‌కు ఆరోగ్యం బాగలేదని తెలిసి గతంలో వెళ్లి పరామర్శించానన్న కేసీఆర్.. సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశ్వనాధ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. విశ్వనాద్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతికి..భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాధ్ అని సీఎం నివాళి అర్పించారు. విశ్వనాధ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు.
Also Read : నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు… గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విశ్వనాధ్ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణంతో షాక్ అయినట్లు చెప్పారు. సినీ రంగానికి..వ్యక్తిగతంగా తనకు తీరని నష్టమన్నారు. విశ్వనాధ్ ఒక లెజెండ్ గా చిరంజీవి నివాళి అర్పించారు. విశ్వనాధ్ ప్రతీ జన్మదినం నాడు ప్రత్యేకంగా చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి గౌరవిస్తారు. ఇప్పుడు విశ్వనాధ్ మరణంతో తనకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ చిరంజీవి ట్వీట్ చేసారు. విశ్వనాధ్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సామాజిక సమస్యలకు ప్రతిబింబాలుగా విశ్వనాధ్ సినిమాలు నిలిచిపోతాయి. కొంత కాలంగా అస్వస్థతో ఉన్న విశ్వనాధ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సూపర్ గిఫ్ట్.. రాజకీయ వర్గాల్లో సంచలనం
- సీతక్క ఇలాఖా నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
- గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు…. దరఖాస్తుకు రేపే చివరి తేదీ
- బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రనికి తీరని ద్రోహం… రేవంత్ రెడ్డి
- ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
One Comment