
క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు రహదారి వెంబడి గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు కారు వేగంగా తీసుకువెళ్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ నీ ఢీ కొట్టి వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని వెంబడించారు. గంజాయి తరలిస్తున్న కారు ప్రధాన రహదారి మూల మలుపు వద్ద స్తంభాన్ని ఢీకొంది. కారులో ఉన్న గంజాయిని, ముగ్గురు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి రమణమూర్తి, సిఐ బానోత్ రాజు, ఎక్సైజ్ సి ఐ రాజశేఖర్ మాట్లాడుతూ
భద్రాచలం నుండి హైదరాబాదుకు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పక్క సమాచారంతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో తనిఖీ చేపట్టగా ఆపకుండా బారికేడ్ల ను ఢీకొని అతివేగంగా కారు వెళ్లిపోయింది.
Read Also : డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు… పెట్రోల్ బాటిళ్లతో హల్‌చల్
అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి ఎక్సైజ్ పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు. ఇల్లందు మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకొని పక్క సమాచారంతో కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీస్ ఎక్సైజ్ శాఖకు చెందిన సిబ్బంది ప్రయత్నించగా ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ బాబా ను ఢీ కొట్టి ఆపకుండా పట్టణంలోకి వెళ్లారు. ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బాబాకు గాయాలయ్యాయి. అనంతరం ప్రధాన రహదారి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కారు వేగ తీవ్రతకు విద్యుత్ స్తంభం విరిగి ఒక వైపుకు వంగిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు . రూ.21 లక్షలు విలువ గల 5 కేజీల చొప్పున ఉన్న 70 ప్యాకెట్లతో ఉన్న 350 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఖమ్మం ఏ ఈ ఎస్ తిరుపతి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్… భారీగా చేరుకున్న ఐటీ అధికారులు
- కళాతపస్వీ మరణం పట్ల సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్
- సీతక్క ఇలాఖా నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
One Comment