
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై రెండేళ్ల తర్వాత ప్రసంగించారు. అయితే.. ఈ ప్రసంగం మీద విపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శాసన సభ్యుడు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికారన్నారు. బయటేమో పులిలా గాండ్రించారని.. తీరా అసెంబ్లీ లోపలికి వెళ్లాక పిల్లి తీరుగా ప్రసంగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌కు గత్యంతరం లేకే అలా మాట్లాడారని తెలిపారు. గవర్నర్‌కు కేసీఆర్‌కు మధ్య రాజీ కుదిరిందని జగ్గారెడ్డి ఆరోపించారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగంలో తుస్సుమనిపించారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి గవర్నర్ బీటీంగా మారిపోయారంటూ ఆక్షేపించారు.
Read Also : అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం… ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన కేటిఆర్
సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే గవర్నర్ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు. ఒకవేళ అలా మాట్లాడకపోతే గవర్నర్ మైక్ కూడా కట్ అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే.. అంతకుమించి ఏమీ లేదంటూ జగ్గారెడ్డి కీలక కామెంట్లు చేశారు. అంతకుముందు.. అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారనుందని తమిళిసై అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని, గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు.
Also Read : బీభత్సం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు… 21 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
“రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. రైతు బీమా అందిస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించాం. రైతు పండించే ప్రతీ బియ్యం గింజను కొనుగోలు చేస్తాం. ఎన్నో సవాళ్లను ప్రభుత్వం అధిగమించింది. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. తెలంగాణ ప్రజల తలసారి ఆదాయం మూడింతలు అయ్యింది. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో 41 బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టాం. తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను 310కి పెంచాం.” అంటూ తమిళిసై పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు… పెట్రోల్ బాటిళ్లతో హల్‌చల్
- దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్… భారీగా చేరుకున్న ఐటీ అధికారులు
- కళాతపస్వీ మరణం పట్ల సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్
One Comment