
తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం. పొగ భారీగా ఎగిసింది. చాలా దూరం నుంచే కనిపిస్తోంది. చూస్తూంటే పెద్ద ప్రమాదమే అనిపిస్తోంది. ఏకంగా 10కి పైగా ఫైరింజన్లు రయ్ రయ్ అంటూ సచివాలయంలోకి దూసుకెళ్లాయి. లోపల ఏం జరిగిందో.. బయటకు తెలీదు. స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.. ప్లాస్టిక్ కవర్లకు మంటలు అంటుకున్నాయని మంత్రి వేముల సెలవిచ్చారు. అగ్నిప్రమాదం కాదు, జస్ట్ మాక్ డ్రిల్ అంటూ పోలీసులు స్టేట్ మెంట్ ఇచ్చారు. అవునా? నిజమా? అయితే మేము వెళ్లి చూస్తామంటూ కాంగ్రెస్ నేతలు కదంతొక్కారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు హడావుడి.
అంతలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎంట్రీ ఇచ్చారు. తనదైన స్టైల్ లో సచివాలయ ప్రమాదం గురించి కామెంట్లు చేశారు. ఈమధ్య ఏపీని కంప్లీట్ గా వదిలేసినట్టున్నారు.. తెలంగాణ పాలిటిక్స్ మీదే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇలా ఇష్యూ రాగానే.. అలా వాలిపోతున్నారు. రెండు రోజుల క్రితం కొత్త సెక్రటేరియట్ చూద్దామని వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లబోయారు. మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఇలా కేఏ పాల్ సర్కారును కార్నర్ చేస్తుంటే.. ఖాకీలు పాల్ కు బ్రేకులు వేస్తున్నారు. తెలంగాణలో ఈ గుండాయిజం ఏంటని ప్రశ్నించారు.
తాజాగా, తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇదే ఛాన్స్ గా కేఏ పాల్ తన అక్కసునంతా వెళ్లగక్కారు. “నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు” అని ఎప్పటిలానే తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.పాల్ గారూ కాస్త జాగ్రత్త.. ఎందుకైనా మంచిది.. మీవల్లే సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని.. ఆ విషయం మీరే చెప్పారని.. పోలీసులు మీ మీద కేసు పెట్టినా పెడతారంటూ.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అదే ఫ్లోను కంటిన్యూ చేస్తూ కేసీఆర్ పై మరిన్ని విమర్శలు చేశారు కేఏ పాల్. అంబేద్కర్ పేరు పెట్టిన సెక్రటేరియట్‌ను కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. అంబేడ్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో పిల్ వేశానన్నారు. కేసీఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని.. ఇప్పటికైనా ఆయన పశ్చాత్తాప పడాలన్నారు. ఈసారి కేసీఆర్ సీఎంగా కూడా గెలవరని.. ఇక ప్రధాని ఏం అవుతారని ఎద్దేవా చేశారు కేఏ పాల్.
One Comment