
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. దాదాపు వారం రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. అతడి తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
హిందూపురం టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి అంబినా లక్ష్మీనారాయణ శుక్రవారం తారకరత్నను పరామర్శించారు. వైద్యులను కలిసి తారకరత్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తారకరత్న కోలుకుంటున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు. వైద్యులు ఆయన మెదడు స్కానింగ్ తీశారని.. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుందని వెల్లడించారు. రిపోర్టును బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబసభ్యులు ఉన్నారని తెలిపారు.
One Comment