
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు షర్మిల తన ప్రజాప్రస్థానం పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలోని శంకరమ్మ తాండా సమీపంలో షర్మిల పాదయాత్ర రీ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 4 గంటలకు మండలంలోని లింగగిరి గ్రామంలో ప్రజలతో మాట్లాడనున్నారు. ఇక మధ్యాహ్నం 4.30 గంటలకు నెక్కొండ మండలంలోని సూరిపల్లి క్రాస్ రోడ్స్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు తొప్పనగడ్డ తాండా గ్రామంలో ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు నెక్కొండ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read Also : ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
పాదయాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో షర్మిల భేటీ కానున్నారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం రాజ్‌భవన్ నుంచే నేరుగా పాదయాత్రకు షర్మిల బయలుదేరనున్నట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్రకు వెళ్లే ముందు గవర్నర్‌తో షర్మిల భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాదయాత్ర వివరాలతో పాటు ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను గవర్నర్ దృష్టికి షర్మిల తీసుకెళ్లే అవకాశముంది. గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, తన అరెస్ట్ విషయాలను గవర్నర్‌కు షర్మిల తెలపనున్నారని వైఎస్సార్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజల సమస్యలపై గవర్నర్‌కు షర్మిల వినతిపత్రం అందించనున్నారని చెబుతున్నారు.
Also Read : మృత్యుంజయ మంత్రంతో తారకరత్నను బతికించిన బాలకృష్ణ!
షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె కారవాన్‌ను తగులబెట్టడం ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసింది. ఘర్షణ వాతావరణం క్రమంలో పాదయాత్రను ఆపేయాల్సింగా షర్మిలకు పోలీసుల నోటీసులు జారీ చేయగా.. షర్మిల పాదయాత్రను అలాగే కొనసాగించారు. దీంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో దాదాపు 15 షరతులతో షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి మంజూరు చేశారు. నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. మగింపు సభను పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించనున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత షర్మిల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు- చైర్మెన్ బాలరాజు యాదవ్
- పాకిస్తాన్ లో బాంబు పేలుడు..28 మంది మృతి
- బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మోసం చేశారు… మరోసారి పొంగులేటి సంచలన కామెంట్స్
- పెండింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం…
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
One Comment