
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-4 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారలు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్ నెలలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత జనవరి 30తో దరఖాస్తు జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఖరి గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించింది టీఎస్‌పీఎస్సీ.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాం రెండో ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం పేరు
శుక్రవారంతో కొత్త గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తు సంఖ్య పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. వీటిలో 11వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
Also Read : బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రనికి తీరని ద్రోహం… రేవంత్ రెడ్డి
జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5న జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష), జూన్ 6న జనరల్ ఎస్సే (పేపర్-1), జూన్ 7న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్-2), జూన్ 8న ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3), జూన్ 9న ఎకానమీ అండ్ డెవలప్‌మెట్ (పేపర్-4), జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్ (పేపర్-5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- సిఎం కేసిఆర్ కు ప్రేమతో బూట్లు…. పాదయాత్రకు ఆహ్వానం
- క్రైమ్ మిర్రర్ దిన పత్రిక నూతన క్యాలండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
- టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్
- సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…