
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ బూట్లను పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో తను చేస్తున్న పాదయాత్రలో కనీసం ఒక్కరోజైనా పాల్గొని ప్రజల కష్టాలు తెలుసుకోవాలని సవాల్ చేసారు వైయస్ షర్మిళ. సీఎం చంద్రశేఖర్ రావు పాలన అద్భుతమంటున్నారని, ఇదే దేశం మొత్తం అమలు చేస్తామంటున్న చంద్రశేఖర్ రావు కు ఛాలెంజ్ విసురుతున్నానన్నారు షర్మిళ. తనతో పాదయాత్రకు వచ్చి సమస్యలు ఏం లేవని రుజువు చేయాలని, సీఎం సమ్యలు ఏం లేవని చూపిస్తే తాను తన ముక్కు నేలకు రాసి రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్లిపోతానని, సమస్యలు ఉంటే సీఎం రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని, సీఎం కు . మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలన్నారు షర్మిళ.అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు తమతో పాదయాత్రకు రావడానికి బూట్లు కూడా పంపిస్తున్నామని, సీఎం ఒక్క రోజైనా వచ్చి నడవాలని, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడాలన్నారు షర్మిళ. పిట్టల దొర లాగా ప్రైవేట్ విమానాల్లో టోపీ పెట్టుకొని తిరగడం కాదని, గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు.
Read Also : క్రైమ్ మిర్రర్ దిన పత్రిక నూతన క్యాలండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రజా దర్బార్ ఎంతో వైభవంగా జరిగేదని, సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసేవారని, ఇప్పుడు ఉద్యమకారులకు కూడా చంద్రశేఖర్ రావు కలవడం లేదన్నారు షర్మిళ.అంతే కాకుండా పాదయాత్ర ఒక యజ్ఞంలాంటిదని, అందరికీ సాధ్యం కాదన్నారు షర్మిళ. ప్రతి నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే.. తాను ఈ యజ్ఞానికి, తెలంగాణ ప్రజలకు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి ద్రోహం చేసిన దాన్ని అవుతానన్నారు షర్మిళ. ఇంతకు ముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుందని, అడుగడుగునా సీఎం చంద్రశేఖర్ రావు వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం జరుగుతుందని మరోసారి వైయస్ షర్మిళ పునరుద్ఘాటించారు. తాము ఎవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించబోమని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతేనే ప్రశ్నిస్తామన్నారు షర్మిళ.ఇదిలా ఉండగా తాను గతంలో ఆరోపణలు చేసిన ఎమ్మేల్యేలు తమతమ నియోకవర్గాల్లో పబ్లిక్ ఫోరం పెట్టాలని, ఆరోపణలు చేసిన వారు, మీడియా, ప్రతిపక్షాలు అందరూ వస్తారని, మీ నిజాయితీ ఏంటో ఆ ఫోరంలో నిలబడి సాక్షాధారాలతో నిరూపించుకోవాలని షర్మిళ సూచించారు.
Also Read : ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
తాను అకారణంగా మాట్లాడడని అనేవారు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలన్నారు. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అనుభవిస్తూ తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేశారని, లక్ష రూపాయల లోపు రుణం ఉన్న 36 లక్షల మందికి రుణ మాఫీ చేస్తానని ఇంత వరకు కేవలం 5 లక్షల మందికి మాత్రమే చేశారని సీఎంపై షర్మిళ మండిపడ్డారుఅంతే కాకుండా 30 లక్షల మంది ఇండ్లు కావాలని అర్జీ పెట్టుకున్నారని, ఇంటి స్థలం కూడా లేదని 10 లక్షల మంది అర్జీ పెట్టుకున్నారని, ఇలాంటి వారిని ఎవ్వరిని కూడా చంద్రశేఖర్ రావు ఆదుకోలేకపోయారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు అనే హామీని తుంగలో తొక్కారని, దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకూ దళితులను అడుగడుగునా మోసం చేశారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయని, ఎంతమందికి దళిత బంధు ఇచ్చారని నిలదీసారు. కనీసం 35 వేల కుటుంబాలకు కూడా ఇవ్వలేదని, ఇది కేవలం ఎన్నికల కోసం వచ్చిన స్కీం అన్నారు షర్మిళ.
ఇవి కూడా చదవండి :
- టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్
- ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని
- సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…
- సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
- ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
One Comment