
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా జీవా ప్రతినిధులు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. గతేడాది ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక పండగను 10 రోజుల పాటు నిర్వహించనున్నామని.., అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి రథోత్సవం, చక్రస్నానంతో పూర్తవుతాయని చెప్పారు.
Read Also : సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
నిత్య కైంకర్యాలు, విశిష్ట వాహన సేవలు ఉంటాయని ముచ్చింతల్ ఆశ్రమ నిర్వాహకులు త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది సమతా మూర్తి, ఆశ్రమాన్ని దర్శించుకున్నారన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగుతాయని ప్రతి ఏడాది… ఇదే తేదీల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విష్వక్సేన వీధి శోధన, మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం 5 నుంచి 5.45 వరకు సామూహిక విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం, సాయంత్రం 6 నుంచి 8.30 వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, త్రీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుందని జీవా ప్రతినిధులు స్పష్టం చేశారు.
Also Read : నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
ఫిబ్రవరి 3న సూర్యప్రభ వాహన సేవ, అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 4న సమతామూర్తికి కృతజ్ఞాంజలి కీర్తన, రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం 5న రామానుజాచార్యులవారి విగ్రహానికి 108 రూపాల్లో శాంతి కల్యాణోత్సవం, 6న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడ సేవలు, 7న ఉదయం డోలోత్సవం, హనుమద్వాహన సేవ, 18 గరుడ సేవలు, ఈనెల 8న కల్హరోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం 18 రూపాల్లో తెప్పోత్సవం ఈనెల 9న రామానుజులవారికి వరివస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ, 18 గరుడ సేవలుంటాయి. ఈనెల 10న ఉదయం సామూహిక ఉపనయనాలు, సాయంత్రం గజవాహన సేవ, 18 గరుడ సేవలు, 11న ఉదయం రథోత్సవం, చక్రస్నానం, మధ్యాహ్నం విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం, 12న ఉత్సవం అంత్యస్నపనం, సాయంత్రం మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడికీ తీర్థ ప్రసాదాలను అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
- మృత్యుంజయ మంత్రంతో తారకరత్నను బతికించిన బాలకృష్ణ!
- తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు- చైర్మెన్ బాలరాజు యాదవ్
- బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మోసం చేశారు… మరోసారి పొంగులేటి సంచలన కామెంట్స్
- చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
One Comment