
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ, వ్యాపారుల పేర్లను చేర్చిన ఈడీ.. తాజాగా మరికొందరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో మరికొందరి పేర్లను చేర్చింది. మెుత్తం 17 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ సారి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో చార్జీషీట్‌ను ఫైల్ చేసిన అధికారులు ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
Read Also : బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రనికి తీరని ద్రోహం… రేవంత్ రెడ్డి
ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. మెుత్తం 428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్‌ను ఈడీ విడుదల చేసింది. అయితే.. కీలకమైన ఈ కేసులో ఏకంగా ఓ రాష్ట్ర సీఎం పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. అయితే ఈడీ ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయటం లేదని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వాలను కూల్చటానికే ఈడీ పని చేస్తోందని విరుచుకుపడ్డారు. ఈడీ 5 వేలకు పైగా ఛార్జ్‌షీట్లు నమోదు చేసిందని అందులో ఎంత మందికి శిక్షపడిందని ప్రశ్నించారు. డిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్ మెుత్తం కల్పితమని కేజ్రీవాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
- సిఎం కేసిఆర్ కు ప్రేమతో బూట్లు…. పాదయాత్రకు ఆహ్వానం
- క్రైమ్ మిర్రర్ దిన పత్రిక నూతన క్యాలండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
- టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్
- ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని
One Comment