
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో విడత బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందన్నారు పీసిసి అద్యక్షుడు, మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. 45 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఏదైనా సాగు నీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను బడ్జెట్లో విస్మరించారన్నారు తెలంగాణ పీసిసి ఛీఫ్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ కు సంబందించి కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన లేదన్నారు రేవంత్ రెడ్డి. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం ఎం జరుగుతుందో చూస్తున్నామన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని, ఇందులో ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని రేవంత్ మండిపడ్డారు.
Read Also : సిఎం కేసిఆర్ కు ప్రేమతో బూట్లు…. పాదయాత్రకు ఆహ్వానం
ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు లెక్కన ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, అందులో తెలంగాణ రాష్ట్రానికి 75 లక్షల ఉద్యోగాలు దక్కాల్సి ఉండగా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. గత పార్లమెంటు సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నకు వివిధ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్రంపేర్కొందన్నారు రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. రైతుల ఆదాయం సంగతి ఏమోగానీ పెట్టుబడి మాత్రం రెండింతలైందని ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారని, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రకాలుగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని, ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించిందని విమర్శించారు. కానీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ పట్ల మాత్రం కేంద్రం వివక్ష చూపిందన్నారు.
Also Read : క్రైమ్ మిర్రర్ దిన పత్రిక నూతన క్యాలండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కరోనా కాలంలో అదుకున్న ఉపాధి హామీ పథకానికి నిధులను, పనిదినాలను కేంద్రం తగ్గించిందని, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్తాయిలో ఖండిస్తోందన్నారు తెలంగాణ పీసిసి ఛీఫ్. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని ఘాటు విమర్శలు చేసారు రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్ ఇద్దరు దోషులని, ప్రధాని మోదీ, సీఎం చంద్రశేఖర్ రావు ఇద్దరు తోడు దొంగలు కూడ బలుకుకుని తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలన్నారు రేవంత్ రెడ్డి.
ఇవి కూడా చదవండి :
- ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
- టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్
- ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని
- సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…
- సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
One Comment