
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి తాజాగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జనతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులు, ఛత్తీస్‌గఢ్‌లోని తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈ భేటీలో చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఎజెండా గురించి జోగికి కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్‌ను ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్‌కు జోగి తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తి అవసరమని, ఆ దిశకు కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారంటూ ప్రశంసించారు. తక్కువ టైమ్‌లోనే తెలంగాణను అభివృద్ధి చేశారని, సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందు వరుసలో ఉంచారని జోగి తెలిపారు. ఈ భేటీలో తన తండ్రి అజిత్ జోగి బయోగ్రఫీ పుస్తకాన్ని కేసీఆర్‌కు అమిత్ జోగి బహుకరించారు. అయితే జనతా కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తతుం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవడం, బీఆర్ఎస్ విధివిధానాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయల్లో బీఆర్ఎస్‌కు ఆయన మద్దతు ఇవ్వనున్నారని, కేసీఆర్‌తో కలిసి నడవనున్నారని బీఆర్ఎస్ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ సీఎంలు, మాజీ సీఎంల వారసులు కేసీఆర్‌ను కలుస్తున్నారు. బీఆర్ఎస్‌లో చేరాలని వారికి కేసీఆర్ సూచిస్తున్నారు. ఇటీవల ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన కుమారుడు శిశర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
Also Read : ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
గిరిధర్ గమాంగ్‌ను ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించనున్నారు. వారితో పాటు ఒడిశాకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంక్రాంతి తర్వాత వివిధ రాష్ట్రాలకు బీఆర్ఎస్‌ను కేసీఆర్ విస్తరిస్తున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేశారు. ఈ నెల 3న మహారాష్ట్రలోని నాందేడ్‌లో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముందుగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా వివిధ పార్టీల్లో ఉండే నేతలను ఆహ్వానిస్తున్నారు. దీంతో పలువురు బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- మృత్యుంజయ మంత్రంతో తారకరత్నను బతికించిన బాలకృష్ణ!
- తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు- చైర్మెన్ బాలరాజు యాదవ్
- బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మోసం చేశారు… మరోసారి పొంగులేటి సంచలన కామెంట్స్
- పెండింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం…
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
One Comment