
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ నవ తెలంగాణ విలేఖరి యాదగిరి పై దాడి చేసిన వ్యక్తులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి యాదవ జర్నలిస్టు యూనియన్ నాయకులు డీజీపీని కలిసి మేయర్ మేఘనారెడ్డితోపాటు ఆమె అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘటనా జరిగిన తీరును డీజీపీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సంఘాల వినతిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ అంజన్ కుమార్, విచారణకు తక్షణమే ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ యాదవ జర్నలిస్టుల యూనియన్ కన్వీనర్ మేకల క్రిష్ణ యాదవ్, కో-కన్వీనర్: శెట్టి హరికృష్ణ యాదవ్ ,సీనియర్ జర్నలిస్టులురాజేష్,దోటి నాగరాజు, ఎస్ శ్రీశైలం యాదవ్, సీనియర్ క్రైమ్ రిపోర్టర్స్
రాఘవ,రవితేజ, రమేష్ ఉన్నారు.