
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిఆర్ఎస్ పార్టీ మొదటినుంచి బిజెపికి అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్న అదానీ గ్రూపు సంస్థల అధినేత్ గౌతమ్ ఆదానీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీ అంబానీ, అదానీ వంటి కార్పోరేట్లకు మేలు చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అనేక సందర్భాల్లో ఆరోపించింది బీఆర్ఎస్. ఇక తాజాగా గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వేదికగా అదానీ గ్రూప్ ను టార్గెట్ చేస్తోంది. అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్లను పతనానికి తీసుకువెళుతోంది. స్టాక్ మార్కెట్ ని షేక్ చేస్తూ అదానీ వ్యవహారం కొనసాగుతుంది.
Read Also : ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని
ఇక ఈ నేపథ్యంలో భారత పారిశ్రామిక దిగ్గజమైన గౌతమ్ అదానీని టార్గెట్ చేస్తూ అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు పార్టీ ఎంపీ కేశవరావు ఈరోజు రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత స్టాక్ మార్కెట్ పైనే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపెడుతున్న అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అదానీ గ్రూపు పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బి ఆర్ ఎస్ దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపే రీతిలో హిండెన్ బర్గ్ నివేదిక ఉందని వాయిదా తీర్మానంలో ప్రస్తావించింది. ఇక దీనిపై రూల్ 267 కింద చర్చ జరపాలని కోరింది. అటు పార్లమెంటులోని ఎగువ సభ లోక్సభలోను ఇదే అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లోనే కాదు, ఇటు పార్లమెంట్ లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
Also Read : సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో అఖిలపక్ష సమావేశంలోనూ దాని అంశాన్ని ప్రతిపక్షాలు లేవలెత్తాయి. అదానీ గ్రూప్ కి సంబంధించి హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ఈ నివేదికపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీనిపై రెండేళ్ల పాటు పరిశోధన చేసి విడుదల చేసిన రిపోర్టు ప్రస్తుతం అదానీ సంస్థలను పతనానికి తీసుకు వెళ్తుంది. ఇక దీనికి ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ కూడా 413 పేజీల రెస్పాన్స్ ను విడుదల చేసింది. అయినప్పటికీ హిండెన్ బర్గ్ తన నివేదికను సమర్థించి మరోమారు అదానీ గ్రూప్ పై విరుచుకుపడింది. జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతోందని మరోమారు ఆరోపించింది. ఇక అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం పార్లమెంట్లోనూ ప్రకంపనలు రేపుతోంది. గౌతమ్ అదానీ టార్గెట్ గా అన్ని రాజకీయ పార్టీలు బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
- నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
- ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
- మృత్యుంజయ మంత్రంతో తారకరత్నను బతికించిన బాలకృష్ణ!
- తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు- చైర్మెన్ బాలరాజు యాదవ్
One Comment