
క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : ఈ మధ్య కాలంలో ‘కార్తీకదీపం’ సీరియల్ తెలియని వారు ఉండరు.. కార్తీకదీపం ముగింపు ఎపిసోడ్ ఉత్కంఠంగా సాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.. సీరియల్ చూడనీయకుండా విసిగిస్తున్నాడంటూ తన దుకాణానికి వచ్చిన వ్యక్తి వేలిని వ్యాపారి కొరికి గాయపరిచిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో చోటుచేసుకుంది.. స్థానిక ఎస్సై తాజొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. అందులోనే మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేశాడు.
Read Also : సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…
తాగిన అనంతరం మరికొంత మద్యం కావాలని అడిగాడు. డబ్బులు ఇవ్వాలని షాపు యజమాని మొగిలి అడగగా, తన వద్ద డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని వెంకటయ్య చెప్పాడు. అయినప్పటికీ వెంకటయ్య వినకపోవడంతో మొగిలి ఆగ్రహంతో అతడి కుడిచేతి చూపుడు వేలిని కొరికాడు. ఈ విషయమై మరుసటిరోజు తాళ్లపెల్లి వెంకటయ్య పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది దుకాణ యజమాని మొగిలిని విచారించగా తాను ఆ సమయంలో ‘కార్తీకదీపం’ సీరియల్ చూస్తున్నానని, డబ్బులు ఇవ్వకపోవడమేకుండా పదేపదే విసిగించడంతో తాను ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పాడు. బాధితుడు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగిలిపై ఐపీసీ 290, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
- నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
- ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
- మృత్యుంజయ మంత్రంతో తారకరత్నను బతికించిన బాలకృష్ణ!
- తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు- చైర్మెన్ బాలరాజు యాదవ్
One Comment