
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ నిత్యం అనేక ప్రశ్నలను సంధిస్తూ, ప్రభుత్వ వైఖరి పై విమర్శలు గుప్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకునూరు మురళిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించగా పోలీస్ స్టేషన్లో బైఠాయించిన మురళి తన నిరసన తెలియజేస్తున్నారు. దీంతో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసలు ఇంతకీ ఆకునూరు మురళిని భూపాలపల్లి జిల్లా పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఆకునూరి మురళి కలెక్టర్ గా ఉన్న సమయంలో 960 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఆ ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించలేదు.
Read Also : కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు కేటాయించాలంటూ లబ్ధిదారులతో కలిసి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆకునూరి మురళిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డగించారు. పోలీసులతో వాగ్వాదం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు కేటాయించేంతవరకు తాను విరమించేది లేదని తెలిసి చెప్పిన మురళి పోలీస్ స్టేషన్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆకునూరి మురళి కి మద్దతుగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, మహిళలు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. ఇక పోలీస్ స్టేషన్లోకి వారంతా రాకుండా పోలీసులు స్టేషన్ గేట్లకు లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఆకునూరి మురళి లబ్ధిదారుల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతకుముందు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వడం లేదని అనేకమార్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హన్మకొండలో ఒక్కదగ్గరే కట్టిన 592 డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇవ్వలేదని అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు.
Also Read : భారత్ జోడో యాత్ర కేవలం ఆరంభం మాత్రమే… రాహుల్ గాంధీ
కట్టి 5సంవత్సరాలు అయినా పేదలకు కేటాయించడం లేదు. పక్కనే వేలమంది కిరాయి ఇండ్లల్లో గుడిసెలల్లో ఘోరమైన పేదరికంతో బతుకుతున్నారన్నారు. సీఎం గారు ఈ ఇండ్లను పేదలకు వారం రోజులలో కేటాయించాలి. అసలు మీరు ఎందుకు 5సo నుండి ఇవ్వడం లేదు? చెప్పాలని ప్రశ్నించారు ఆకునూరి మురళి. ఇక భూపాలపల్లి లోనూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో లబ్ధిదారులతో కలిసి సంక్రాంతికి ముందు ఆందోళన చేశారు. భూపాలపల్లిలో 5 సంవత్సరాల క్రితం తాను కలెక్టర్ గా ఉన్నప్పుడు కట్టించిన 960 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికి ఇంకా పేదలకు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 400 మంది లబ్దిదారులతో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ సంక్రాంతికి ముందు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారని, సీఎం కేసీఆర్ దయచేసి ఇవ్వాలని అప్పుడు కూడా ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా మరో మారు భూపాలపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలని ఆకునూరి మురళి పోరుబాట పట్టారు.
ఇవి కూడా చదవండి :
- తారకరత్నకు నేడు కీలక వైద్య పరీక్షలు….ఆతరువాతే స్పష్టత
- గవర్నర్‌పై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం… బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంపై పిటిషన్
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
- సిద్దిపేట జిల్లాలో బయటపడ్డ వెయ్యి ఏళ్ల క్రితం నాటి పురాతన విగ్రహం…
2 Comments