
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ మసీదులో బాంబు దాడికి పాల్పడ్డారు. పెషావర్ లోని ఓ మసీదులో ఈ బాంబు పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక పోలీస్ లైన్స్ ప్రాంతంలో మసీదు ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక లేడీ రీడింగ్ ఆస్పత్రి లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనంలో కొంత భాగం కుప్పకూలిపోగా శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Read Also : బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మోసం చేశారు… మరోసారి పొంగులేటి సంచలన కామెంట్స్
పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్ లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది కూడా పేషావర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కొచా రిసల్దార్ ప్రాంతంలోని షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63 మంది చనిపోయారు. అయితే ఇప్పటి ఘటన బాంబు పెట్టడం వల్ల జరిగిందా.. లేక ఆత్మాహుతి దాడి జరిగిందా అనే దానిపై క్లారిటీ రాలేదు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. దేశంలో ఉగ్రదాడులు పెరిగిపోయాయని.. ఉగ్రముప్పును ఎదుర్కోవడానికి నిఘా పెంచాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- పెండింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం…
- గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు… గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
- మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
- భారత్ జోడో యాత్ర కేవలం ఆరంభం మాత్రమే… రాహుల్ గాంధీ