
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నందమూరి తారక రత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. అటు నందమూరి కుటుంబంలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ నందమూరి తారక రత్న ఆరోగ్యంపై విపరీతమైన టెన్షన్ కనిపిస్తుంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయాలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కొనసాగుతున్నప్పటికీ గతంతో పోలిస్తే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉందని, కొంత మార్పు కనిపించిందని చెప్తున్నారు. అయితే నేడు నిర్వహించనున్న పరీక్షలతో ఆయన ఆరోగ్యంపై మరింత క్లారిటీ రానుంది.
Read Also : గవర్నర్‌పై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం… బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంపై పిటిషన్
అయితే నేడు తారకరత్నకు మరిన్ని కీలక వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. నేడు నిమ్స్ నుంచి మరోమారు వైద్యులు నారాయణ హృదయాలయ కు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు చేయనున్నారు. అనంతరం నేడు ఆయన ఆరోగ్యం పై వైద్యులు బులిటెన్ విడుదల చేయనున్నారని సమాచారం. బ్రెయిన్ డెడ్ రికవరీ పై ఫోకస్ పెట్టిన వైద్యులు ఎంత మేరకు బ్రెయిన్ డేట్ ను రికవరీ చేయగలిగామన్న దానిపైన పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి పరీక్షలు కీలకం కావడంతో, పరీక్షల అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తారకరత్న శరీరం చికిత్సకు స్పందిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళనకర పరిస్థితి నుంచి ఇంకా తారకరత్న బయటపడలేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తాజాగా నారాయణ హృదయాలయ లో కొనసాగుతున్న టెన్షన్ స్పష్టంగా చెబుతుంది.
Also Read : ఉత్తమ వైద్య సేవలలో దేశంలో తెలంగాణకు మూడవ స్థానం…. హరీష్ రావు
ఇప్పటికే తారకరత్న కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాలకృష్ణ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. తారకరత్న పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్న తర్వాత మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న పోరాటం చేస్తున్నారన్నారు. నిన్నటి మీద ఈరోజు తారకరత్న స్పందిస్తున్నారు.. ఎక్మో మీద లేరు కానీ క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు అంటూ పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు..తాత ఆశీస్సులతో కోలుకుంటారని ఆశిస్తున్నాను, తిరిగి మనతో తారకరత్న గతంలో లాగానే ఉంటారని భావిస్తున్నాను అంటూ తారకరత్న త్వరగా కోలుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
- ఒడిశా మంత్రిపై కాల్పులు.. పరిస్థితి విషమం
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నల్గొండ బీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఎమ్మెల్యేలకు సీనియర్ల షాక్ లు!
- సిద్దిపేట జిల్లాలో బయటపడ్డ వెయ్యి ఏళ్ల క్రితం నాటి పురాతన విగ్రహం…
One Comment