
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపై ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్‌పై హైకోర్టులో దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు మెుదలవుతాయని చెప్పారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడంతో.. ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో చివరికి గవర్నర్ తీరుపై హైకోర్టు మెట్లు ఎక్కాలని నిర్ణయం తీసుకుంది. గతంలో గవర్నర్ ప్రసంగం లేనప్పటికీ బడ్జెట్‌కు తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం పెండింగ్‌లో పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
- భారత్ జోడో యాత్ర కేవలం ఆరంభం మాత్రమే… రాహుల్ గాంధీ
- తారకరత్నకు నేడు కీలక వైద్య పరీక్షలు….ఆతరువాతే స్పష్టత
- ఉత్తమ వైద్య సేవలలో దేశంలో తెలంగాణకు మూడవ స్థానం…. హరీష్ రావు
One Comment