
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వారి ఆగడాలు రోజురోజుకు శృతి మింతున్నాయి. అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ.. కట్టలేని వారిని వేధిస్తూ చివరకు వారి చావుకు కారణమవుతున్నారు. ఇలా ఇప్పటికే లోన్ యాప్ వేధింపులకు బలయిన వారు చాలా మందే ఉన్నారు. విజయవాడలో లోన్ యాప్ బాధితుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలో యాప్ ఆగడాలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా మరొకరి ప్రాణం బలిగొంది.
Read Also : కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
భవానీపురంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక భవానీ పురం పోలిస్ స్టేషన్ పరిధిలోని సూరయపాలెం గ్రామంలో తంగెళ్ళముడి రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్ మార్ఫింగ్ ఫోటోలను తన భార్య రత్నకు పెట్టి బెదిరించారు లోన్ యాప్ నిర్వాహకులు. తనను లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారని బతకననీ చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు రాజేష్. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్య రత్నకు ఫోన్ చేసి బోరున విలపించాడు.
Also Read : తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకున్న స్థితిలో రాజేష్ కనిపించాడు. ఆసుపత్రికి తరలించే లోపు రాజేష్ మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం రాజేష్ డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి ఆకర్షిస్తున్నారు. తర్వాత భరించలేనంత వడ్డీ వసూలు చేస్తున్నారు. అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెల్లించకపోతే పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టి వేధించడం మొదలుపెడతారు. అవమానాలు తట్టుకోలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- లండన్ లో ఇంటి అద్దె అక్షరాల రూ.2.5 లక్షలు
- జపాన్ లో వంద రోజులు ఆడిన తొలి భరతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు…
- కొడుకు భార్యను పెళ్లాడిన వృద్ధుడు
- బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
- బీజేపీలో ఈటలకు వరుస అవమానాలు! అంతా ఆయన డైరెక్షన్ లోనేనా?