
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు నిమ్స్ వైద్యులు. పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న 19 ఏళ్ల వయసున్న యువతికి ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే కేవలం లేటెస్ట్ మెడికల్ డివైస్‌ల ద్వారా గుండెలోని రంధ్రాన్ని పూడ్చడంతో పాటు రక్తనాళం వాల్వ్‌ను కూడా సరిచేశారు. సుమారు రూ.50 లక్షల ఖరీదైన ఈ చికిత్సను నిమ్స్ వైద్యులు కేవలం రూ.15 లక్షలతో మెరుగైన చికిత్స అందించి ఆ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన బి. రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె జాహ్నవి (19) పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్నది.
Read Also : తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
మూడేండ్ల వయస్సులోనే ఒక కార్పొరేట్ దవాఖానలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కానీ, గుండె పైభాగంలో ఉన్న చిన్నపాటి రంధ్రాన్ని మాత్రం వదిలేశారు. 14 ఏళ్ల వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న జాహ్నవికి వయస్సుతో పాటు గుండెలో ఉన్న రంధ్రం పెరుగుతూ వచ్చింది. గుండె కుడివైపు నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పల్మనరీ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతింది. యువతి కండీషన్ చూసి ఈ నెల 25న డాక్టర్ సాయిసతీశ్ నేతృత్వంలో కార్డియాలజీ వైద్యులు డాక్టర్ హేమంత్, డాక్టర్ అర్చన, సిటీ సర్జన్ డాక్టర్ అమరేశ్, అనస్తీషియా నిపుణురాలు డాక్టర్ నిర్మల బృందం రెండున్నర గంటల్లోనే ఈ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది. చికిత్స జరిగిన రెండు రోజుల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- బీజేపీలో ఈటలకు వరుస అవమానాలు! అంతా ఆయన డైరెక్షన్ లోనేనా?
- కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
One Comment