
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అప్పుడప్పుడు తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు, విగ్రహాలు, శిల్పాలు బయటపడుతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరం క్రితం అప్పటి మానవులు వాడిన పరికరాలతో పాటు దేవుళ్ల విగ్రహాలు తవ్వకాల్లో కనబడుతూ ఉంటాయి. రాజులకాలం నాటి రాళ్లు, పాత్రలు, శాసనాలు లాంటివి కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు కొన్నిచోట్ల తవ్వకాలు కూడా జరుపుతారు. ఈ తవ్వకాల్లో పాత కాలం నాటి వస్తువులను వెలికి తీస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వెయ్యి ఏళ్ల క్రితం నాటి శిల్పం బయటపడింది.
Read Also : సహజీవనం చేస్తున్న జంట అనుమానాస్పద మృతి…
1000 ఏళ్ల నాటి విష్ణుమూర్తి ద్వారపాలకుడైన విజయ శిల్పం లభ్యమైంది. తెలంగాణలో ఇప్పటివరకు తవ్వకాల్లో ఇంత పెద్ద శిల్పం ఎప్పుడూ లభించలేదని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో తవ్వకాల్లో లభ్యమైన అతి పెద్ద శిల్పంగా ఇది నిలిచింది. సిద్దిపేటలోని మల్యాల గ్రామంలోని నారాయణరావుపేటలో ఓ వరి పొలంలో ఈ శిల్పం ఆదివారం దొరికింది. ఇది రాస్ట్రకట, తొలి కల్యాణ చాళుక్యుల కాలం కంటే తర్వాతి కాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రానైట్ రాతితో ఈ శిల్పాన్ని చెక్కగా.. తలపై కిరీటం, శరీరంపై ఆభరణాలు, రెండు చేతులలో గాధ, శుచి ముద్ర, శంకు, చక్రలను కలిగి ఉంది. ఈ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్టించాలని గ్రామస్తులకు పురావస్తు శాఖ అధికారులు సూచించారు.
Also Read : దున్నపోతుకు రూ.1.5 కోట్లు ఇస్తామన్నారు.. అయినా అమ్మరట
పురావస్తు పరికరాలపై పరిశోధోనలు చేసేవారికి, భావితరాలకు ఇది ఉపయోగపడుతుందని సూచించారు. చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా వివరాలను విగ్రహం వద్ద ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు తెలిపారు. అహోబిలం కరుణాకర్, మొహమ్మద్ అనే వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో రామోజు హరగోపాల్ ఆధ్వర్యంలోని తెలంగాణ కొత్త చరిత్ర బృందమైన నసీరుద్దీన్, పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి వెళ్లి శిల్పాన్ని పరిశీలించారు. పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో లభ్యమైన అతి పెద్ద శిల్పం ఇదేనని, గతంలో వరంగల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లో వెలికితీసిన కాకతీయ కాలం నాటి శిల్పాల కంటే ఇది అతి పెద్ద శిల్పమని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
- నేడు పార్టీ ఎంపిలతో సిఎం కేసిఆర్ కీలక భేటీ…
- మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత….
- కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
- బీజేపీలో ఈటలకు వరుస అవమానాలు! అంతా ఆయన డైరెక్షన్ లోనేనా?
2 Comments