
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సహజీవనం చేస్తున్న ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ మండలం లెనిన్ నగర్ కు చెందిన తూర్పాటి చెన్నమ్మకు కుమార్తె సరస్వతి, కొడుకు యాదగిరి ఉన్నారు. చెన్నమ్మకు 13 ఏళ్ల కిందట శివ అనే వ్యక్తితో వివాహమైంది. దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. శివ పదేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, సోదరుడు చెప్పినట్టుగా లెనిల్ నగర్ లోనే ఉంటూ కూలి పనులకు వెళ్తోంది సరస్వతి. పిల్లలను ఓ హాస్టల్ లో చేర్పించి చదివిస్తుంది. కర్మల్ గూడ రాజీవ్ గృహ కల్పలో సాదుల మహేందర్ అనే 21 ఏళ్ల యువకుడు ఉంటున్నాడు. మూడేళ్ల కిందట సరస్వతితో పరిచయం సహజీవనానికి దారి తీసింది.
Read Also : దున్నపోతుకు రూ.1.5 కోట్లు ఇస్తామన్నారు.. అయినా అమ్మరట
తల్లి, సోదరుడు ఎంత చెప్పినా వినకుండా మహేందర్ తోనే ఉంటుంది. తమకు పెళ్లైందని చెప్పింది. ఇటీవల మహేందర్, సరస్వతికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ తరచూ గొడవలు పడసాగారు. దీంతో లెనిన్ నగర్ లోని పుట్టింటికి వచ్చేసింది సరస్వతి. వారం రోజుల కిందట మళ్లీ మహేందర్ దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సరస్వతి, మహేందర్ లు రాజీవ స్వగృహ కల్పలోని నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సరస్వతి తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి వెంటనే ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ సరస్వతి డెడ్ బాడీ కింద పడి ఉండగా.. మహేందర్ ఉరి వేసుకొని కనిపించాడు. యాదగిరి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
- మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత….
- నేడు పార్టీ ఎంపిలతో సిఎం కేసిఆర్ కీలక భేటీ…
- తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
- ఆగని లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. విజయవాడలో మరొకరు బలి
- కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
One Comment