
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చాలా మంది మూగజీవాలను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ వాటికి ఆహారం తినిపిస్తూ వాటి మీద మమకారం పెంచుకుంటారు. వాటిని వదిలి దూరంగా ఉండలేరు. రోజూ బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఆ మూగజీవాలు మన కోసం ఎక్కుడున్నా పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆప్యాయత కనబరిచే అవంటే చాలామందికి అమితమైన ప్రేమ. అందుకే మూగజీవాలు దూరమైతే భరించలేరు. వాటిని డబ్బులతో వెలకట్టలేరు. కర్ణాకటలోని బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్ అనే రైతు కూడా ఇలానే భావిస్తున్నాడు. తాను ఎంతో అప్యాయంగా పెంచుకుంటున్న దున్నకు ఎన్ని కోట్లిచ్చినా అమ్మనని తెగేసి చెబుతున్నాడు.
Read Also : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత…
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ వ్యవసాయ ప్రదర్శనలో ఈ దున్నపోతును ఉంచారు. దీని పేరు గజేంద్ర. ఈ దున్నపోతు రైతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గజేంద్రను చూసిన పంజాబ్ రైతులు దున్నపోతును కొంటామని ముందుకొచ్చారు. దున్నపోతుకు రూ.1.5 కోట్లు ఇస్తామన్నారు. అయితే ఇందుకు రెడ్యాచే మాలక్ ససేమిరా అన్నాడు. 1500 కిలోల బరువున్న గజేంద్ర రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుందట. రెండు కిలోల పిండి, మూడు కిలోల గడ్డి తింటుందట. ఇలాంటి దున్నలు తమ దగ్గర ఐదు ఉన్నాయని రెడ్యాచే మాలక్ చెప్పాడు. దున్నలు కూడా తమ కుటుంబ సభ్యులలాంటివేనని.. ప్రేమగా పెంచుకుంటున్న దున్నలను ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మేది లేదని రెడ్యాచే చెబుతున్నాడు.
ఇవి కూడా చదవండి :
- నేడు పార్టీ ఎంపిలతో సిఎం కేసిఆర్ కీలక భేటీ…
- తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్…
- నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
- ఆగని లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. విజయవాడలో మరొకరు బలి
One Comment