
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థతి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు బెగంళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తారకతర్న అరుదైన ‘మెలెనా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని అన్నారు. బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. మెలైనా వ్యాధి కారణంగా తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు.
Read Also : బీజేపీలో ఈటలకు వరుస అవమానాలు! అంతా ఆయన డైరెక్షన్ లోనేనా?
ఆయనకు గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎక్మో (ECMO) ద్వారా చికిత్స అందిస్తున్నామని, బెలూన్ యాంజియో ప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా తారకతర్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆయన సోదరులు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్ కాసేపట్లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వారు బెంగళూరు చేరుకోనున్నారు. తారకతర్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. శనివారం నాడు బెంగళూరులోని హృదాయాలయ ఆసుపపత్రికి వెళ్లిన చంద్రబాబు వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
Also Read : బీజేవైఎం కార్యకర్తలపై పోలీసుల దాడి హేయమైన చర్య…. బండి సంజయ్
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తారకతర్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, కోలుకోవడానికి ఇంకా టైమ్ పడుతుందని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఇదిలా ఉండగా తారకతర్న ఆరోగ్య పరిస్థితిపై దగ్గుబాటి పురందేశ్వరి ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె డాక్టర్లతో మాట్లాడారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలకృష్ణ, చంద్రబాబు, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఆయన తండ్రి ఉన్నారు. కాగా తారకతర్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు
- జపాన్ లో వంద రోజులు ఆడిన తొలి భరతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు…
2 Comments