
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుజరాత్‌లో ఇవాళ జరగాల్సిన పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావటంతో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షకు రెండు గంటల ముందే హైదరాబాద్‌లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పేపర్ ప్రింట్ అయినట్లు అధికారులు చెప్పారు. ఒడిషాకు చెందిన ప్రదీప్ నాయక్, హైదరాబాద్‌కు చెందిన జీత్ నాయక్‌లు ఈ పేపర్ లీక్ ఘటనకు సూత్రధారులుగా గుర్తించారు.
Read Also : సిద్దిపేట జిల్లాలో బయటపడ్డ వెయ్యి ఏళ్ల క్రితం నాటి పురాతన విగ్రహం…
జీత్ నాయక్ పేపర్‌ను మద్రించి.. ప్రదీప్ నాయక్‌కు అందజేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై హైదారాబాద్, ఆంధ్రాలో ఏటీఎస్ అధికారులు విచారణ చేపట్టారుపరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో పరీక్షా పేపర్ లీక్ కావటం, మరో రెండు గంటల్లో జరగాల్సిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తంచేశారు. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షా పేపర్ లీక్ కావటంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్‌కు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. గుజరాత్‌లో 1,181 పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది.
Also Read : సహజీవనం చేస్తున్న జంట అనుమానాస్పద మృతి…
ఈ ఉద్యోగాల కోసం దాదాపు 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం కోసం సన్నద్ధమై.. నేడు జరగాల్సిన పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే.. పేపర్ లీక్ ఘటనతో చివరి క్షణంలో పరీక్షలు రద్దయ్యాయి. దీంతో కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శించారు. పేపర్ లీక్ కారణంగా గత 12 ఏళ్లలో 15 సార్లు పోటీ పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
- మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత….
- దున్నపోతుకు రూ.1.5 కోట్లు ఇస్తామన్నారు.. అయినా అమ్మరట
- తారకరత్నకు అరుదైన మెలెనా వ్యాధి… బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
- ఆగని లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. విజయవాడలో మరొకరు బలి
One Comment