
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఒడిశాలో ఓ మంత్రిపై కాల్పులు జరగడం కలకలం రేపింది. అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయలపాలైన ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లినప్పుడు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఝార్సుగూడు జిల్లా బిజ్రరాజ్ నగర్ లోని గాంధీచౌక్ వద్దకు చేరుకున్న సమయంలో నబకిశోర్ వాహనం దిగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఆయనపై దాడికి గల కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. దాడి విషయం తెలుసుకున్న బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇవి కూడా చదవండి :
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సిద్దిపేట జిల్లాలో బయటపడ్డ వెయ్యి ఏళ్ల క్రితం నాటి పురాతన విగ్రహం…
- సహజీవనం చేస్తున్న జంట అనుమానాస్పద మృతి…
- మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత….
- కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం