
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణను నీతి అయోగ్ గుర్తించిందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను ఆయన ఇవాళ విడుదల చేశారు. ‘మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 అయితే.. ప్రస్తుతానికి 21కి తగ్గింది. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య 61 శాతం పెరిగింది. నార్మల్ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
Read Also : చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
సాధారణ ప్రసవాలకు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చాం. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2021లో 2.57 లక్షలు, 2022లో 3.04 లక్షల సర్జరీలు చేశాం. 2022లో 5.40 లక్షల డెలివరీలు జరిగిఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3.27 లక్షల డెలివరీలు జరిగాయి. దాదాపు 62 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో డెలివరీలను 99.9 శాతానికి పెంచాం. డెలివరీ సమయంలో చనిపోయే తల్లుల సంఖ్య తెలంగాణలో 43 మాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్ ఏర్పాటుచేశాం. వసతులు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. 2021లో 4 కోట్ల 21 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందారు. 2022లో 4 కోట్ల 60 లక్షల మందికిపైగా ఓపీ సేవలు వినియోగించుకున్నారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా 30 లక్షలకు పైగా పెరిగింది.
Also Read : ఒడిశా మంత్రిపై కాల్పులు.. పరిస్థితి విషమం
2022లో బస్తీ దవాఖానాల్లో 47 లక్షల మంది ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఎన్‌సీడీసీ స్క్రీనింగ్ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. వరంగల్‌లో రూ.11 వందల కోట్లతో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 1,489 నుంచి 3,489కి పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో భాగంగా ఉచితంగా ఒక కోటి కంటే ఎక్కువ వైద్య పరీక్షలు చేశాం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉండగా.. త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్, 7 పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.’ అని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నల్గొండ బీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఎమ్మెల్యేలకు సీనియర్ల షాక్ లు!
- సిద్దిపేట జిల్లాలో బయటపడ్డ వెయ్యి ఏళ్ల క్రితం నాటి పురాతన విగ్రహం…
- కత్తి పెట్టకుండానే హార్ట్ ఆపరేషన్… నిమ్స్‌లో అరుదైన చికిత్స చేసిన వైద్య బృందం
- మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత….
One Comment