
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బులెటిన్‌లో ప్రకటించారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతోందని వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్నకు ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ఉదయం వైద్యులు ప్రకటించడంతో.. అభిమానులు వేచి చూస్తున్నారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో.. అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.
Read Also : ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
ఆయన కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తారకరత్నతో పాటు బాలయ్య బెంగళూరులోనే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా హాస్పిటల్‌లోనే ఉండి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట నందమూరి, నారా ఫ్యామిలీ కూడా బెంగళూరుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాలయ్యను అడిగి చంద్రబాబు తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యంపై బాలయ్యను అడిగి ఆరా తీశారు. ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
- తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం…
4 Comments