
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళిదే. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. అందుకు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు సాధిచింది. ఇంకా అవార్డుల వేట కొనసాగుతోంది. ఇటీవలె ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అంతేకాదు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు నామినేట్ అయింది.
Read Also : బీజేవైఎం కార్యకర్తలపై పోలీసుల దాడి హేయమైన చర్య…. బండి సంజయ్
ఇదిలా ఉంటే జపాన్ లో ఆర్ఆర్ఆర్ కు మంచి స్పందన వచ్చింది. అక్కడ శతదినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 42 కేంద్రాల్లో నేరుగా, షిఫ్ట్స్ పద్ధతిలో మరో 114 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. గతేడాది అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైంది. శతదినోత్సవ మార్కు దాటిన విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్వీట్టర్ వేదికగా చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన జపాన్ అభిమానులకు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. లవ్ యూ జపాన్ అంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- పాకిస్తాన్ లో అంతుచిక్కని వ్యాధి.. 18 మంది మృతి.. చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులు
- పఠాన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే
- వందేభారత్ రైలులో చెత్తాచెదారం.. నెటిజన్లు ఫైర్
- కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
One Comment