
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : తిరుమలలో రధసప్తమి వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రధసప్తమి నాడు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో విహరించే వేళ.. భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసారు. సూర్య ప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిస్తున్నారు. నేటి ప్రత్యేకమైన రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ఈ రోజు వరకు టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది. భక్తులకు అదనంగా ప్రసాదాలను సిద్దం చేసింది. రధ సప్తమి వేళ టీటీడీ వైభవంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవ ప్రారంభమైంది. రాత్రి వరకు వరుసగా సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో.. భారీగా భక్తులు తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు.
Read Also : ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
భక్తుల కోసం మాడవీధుల్లోని గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు.. అన్న పానీయాలను టీటీడీ అందిస్తోంది. తాత్కాలకి షెడ్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. చలి ఎక్కువగా ఉన్నా స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి.. సేవలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఈ రోజు శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించనున్నారు. శ్రీవారు భక్తులు రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు గా భావించటం మరో ప్రత్యేకత. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది.
Also Read : తమపై విమర్శలు చేస్తున్న స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న సీఎం…
ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు. రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి ప్రత్యక్షంగా సేవలను ..భక్తులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ప్రతీ ఏటా తిరుమలలో రధ సప్తమి నాడు జరిగే విశేష కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంత..ఈ రోజు సప్త వాహనాల్లో శ్రీవారి దర్శనం కోసం ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో రధ సప్తమి వేడుకలు ఘనంగా కొనసాగతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
- రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
2 Comments