
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : ఫ్లోరోసిస్ రక్కసిపై అలుపెరుగని పోరాటం చేసిన అంశాల స్వామి ఇకలేరు. ట్రై సైకిల్ పై నుంచి ప్రమాదవాశాత్తు కింద పడిన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. పుట్టుకతోనే ఫ్లోరోసిస్ బారిన పడిన అంశాల స్వామి.. గత 32 ఏళ్లుగా ఫ్లోరోసిస్ సమస్యపై అలుపెరుగని పోరాటం చేశారు. ఎటూ కదల్లేని స్థితిలోనూ తనలాంటి బాధితుల కోసం తన గళాన్ని వినిపించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి.. ఫ్లోరోసిస్‌కు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫ్లోరైడ్ సమస్యలపై సామాజిక వేత్త దుశ్చర్ల సత్యనారాయణ స్థాపించిన జలసాధన సమితితో కలిసి పోరాటాలు చేశారు.
Read Also : నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నాడు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లిన దుశ్చర్ల.. ప్రధాని టేబుల్‌పై స్వామిని పడుకోబెట్టి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. అంశాల స్వామి పరిస్థితిని చూసి నాటి ప్రధాని చలించిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమాల్లోనూ తనలాంటి ఫ్లోరైడ్ బాధితుల కోసం అంశాల స్వామి అవిశ్రాంతంగా పోరాటం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో కాలం వెల్లదీసిన స్వామి గతేడాది.. మంత్రి కేటీఆర్ సహకారంతో సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా అంశాల స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో భోజనం చేశారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకొని.. స్వామి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్వామి అకాల మరణ మృతి పట్ల కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు.
Also Read : తమపై విమర్శలు చేస్తున్న స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న సీఎం…
స్వామి మృతి బాధకరమని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ‘అంశాల స్వామి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ బాధితుల కోసం అతను చేసిన పోరాటం అసమాన్యం. స్వామి చాలా మందికి ప్రేరణ. అతను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వామితో కలిసి భోజనం చేసిన ఫోటోను కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్వామి మృతిపట్ల మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్‌తో పాటు పలువురు నాయకులు, జిల్లా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ రక్కసిని జిల్లా నుంచి తరిమేందుకు అంశాల స్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు, శివన్నగూడెంలో ప్రాజెక్టు నిర్మాణానికి స్వామి నిర్విరామంగా పోరాడారని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
- మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
5 Comments