
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలిగించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. అన్ని హంగులున్న ఈ రైళ్లలో ప్రయాణికులు వాటర్ బాటిల్స్, చెత్తాచెదారం, పాలిథీన్ కవర్స్ ను ఎక్కడివక్కడే వదిలేస్తున్నారు. ఈ సెమీ హై స్పీడ్ రైళ్లల్లో చెత్తాచెదారం పడేసి అపరిశుభ్రంగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో రైలులో చెత్తాచెదారం, వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. కార్మికుడు వీటిని చీపురుతో శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోను అవనిశ్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. వుయ్ ద పీపుల్ అనే క్యాప్షన్ ను జత చేశారు.
Read More : కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి –
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఏదైనా ప్రజల ఆస్తి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. అని కామెంట్లు పెడుతున్నారు. భారతదేశ ప్రజలు హక్కుల కోసం పోరాడతారు.. కానీ బాధ్యతలను మాత్రం విస్మరిస్తారు.. అంటూ మరో నెటిజన్ అన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఈ వందే భారత్ రైళ్లను నడుపుతుంది. కానీ ప్రజలు మాత్రం ఇదేమీ పట్టనట్టు వాటిని పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతగా ప్రవర్తించడం లేదంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 రూట్లలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఇటీవలె తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
One Comment