
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అక్కడ ఇంటి అద్దె అక్షరాల రెండున్నర లక్షలు. అద్దెలకుండే వారు లబోదిబోంటున్నారు. వామ్మో ఇంత అద్దె కట్టి ఇక్కడ బతకలేమంటున్నారు. ఒక్కసారిగా పెరిగిన అద్దెలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఏం తినాలి ఏం బతకాలి అని వాపోతున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లో ఇంటి అద్దె మండిపోతుందట. వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో అద్దెలు వసూలు చేస్తుండటంతో అద్దె ఇళ్లలో ఉంటున్న వారి పరిస్థితి అయోమయంగా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ప్రస్తుతం అక్కడ ఇంటి నెల అద్దె సగటున రూ. 2.5 లక్షలుగా ఉంది.
Read Also : కొనసాగుతున్న కడప ఎంపి అవినాష్ రెడ్డి విచారణ…. –
ఇక నగరం సెంటర్ లో అయితే 3 లక్షలు పెట్టినా అద్దె ఇల్లు దొరకని పరిస్థితి. మరోవైపు కరెంటు ఛార్జీలు పెరిగి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న జనానికి ఈ పెరిగిన అద్దెలు మరింత భారంగా మారాయి. గతేడాది చివరి నాలుగు నెలల్లో ఇంటి అద్దెలు సగటున రెండున్నర లక్షలకు పెరిగాయట. ఇంటి కిరాయి ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు. ఇక ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు అక్రమ సంపాదనకు తెర తీశారు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
- తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం…