
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం చేపట్టిన డీజీపీ కార్యాలయం ముట్టడిలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం నేతలు, కార్యకర్తలను తీవ్రంగా గాయపడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేసిఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడిందని మండిపడ్డారు. పోలీసులు, బీజేవైం కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న బీజేవైం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Read Also : కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
భాను ప్రకాశ్‌కు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న తమ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడిందని.., అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం, ప్రశ్నించే వారిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సై పరీక్షలో తొమ్మిది మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో ఏడు మార్కులను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం మెుండిగా వ్యవరిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
- తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం…
2 Comments