
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ లో పెళ్లి కూతురు అలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రోజూ జరిగే వేడుకలకు సంబంధించిన డ్రెస్ దగ్గర నుంచి మేకప్, హెయిర్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రకరకాల దుస్తులు, భిన్నమైన హెయిల్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకునేలా ప్రయత్నిస్తుంటారు. పెళ్లి కూతురు కట్టుకునే దుస్తుల్లో డిజైన్లలో కొత్త దనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. కానీ భిన్నమైన హెయిల్ స్టైల్స్ చాలా తక్కువగా చూసి ఉంటాము.
Read Also : జపాన్ లో వంద రోజులు ఆడిన తొలి భరతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు… –
అలా కొత్తదనం కోసం ఓ పెళ్లికూతురికి చేసిన హెయిల్ స్టైల్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ హెయిర్ స్టైలిస్ట్ చాలా భిన్నంగా ఆలోచించింది. అందుకే పెళ్లి కూతురు జడను చాక్లెట్లు, టోఫీలతో అలంకరించింది. చిత్ర అనే ఓ మేకప్ ఆర్టస్ట్ ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో పెళ్లి కూతురు చాలా సింపుల్ చీరలో కనిపిస్తుంది. కానీ ఆమె జడ మాత్రం చాలా వినూత్నమైన ఆలోచనలో కనిపించింది. జడ మొత్తం చాక్లెట్లతో అలంకరించబడి ఉంది.
Also Read : బీజేవైఎం కార్యకర్తలపై పోలీసుల దాడి హేయమైన చర్య…. బండి సంజయ్ –
జడలో కిట్ క్యాట్, మిల్కీ బార్, ఫైవ్ స్టార్, ఫెర్రెరో రోచర్ లాంటి బ్రాండెడ్ చాక్లెట్లు అందంగా అలకరించబడ్డాయి. పైన కొప్పు నుంచి కింద కొప్పుల వరకు అందమైన అలంకరణతో ఆకట్టు కుంటున్నాయి. వెనుక మాత్రమే కాదు ముందు వైపు ముఖం మీద పాపిటి బిళ్ల కూడా చాక్లెట్లతోనే తయారు చేసి ఉంది. ఇక నెక్లెస్ కూడా చాక్లెటే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. జడ అందంగానే ఉంది కానీ.. దీన్ని చూస్తే పిల్లలు వదిలిపెడతారా అని చిలిపిగా ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
- తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం…