
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ మరింత అగాధంలోకి కూరుకుపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడక్కడ అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను హరిస్తుంది. కరాచీలో ఇప్పటికే ఈ వ్యాధితో 18 మంది చనిపోయారు. ఇందులో మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులుండటం. అయితే ఇంత వరకు మరణాలకు గల కారణాలు కానీ.. ఆ వ్యాధి ఏమిటనేది కానీ తెలియరాలేదు.
Read More : పఠాన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే –
వ్యాధి సోకిన వారికి గొంతు నొప్పి, జ్వరం, గొంతు దగ్గర వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ఏమిటో వైద్యులు గుర్తించలేకపోతున్నారు. జనవరి 10వ తేదీ నుంచి 25వరకు ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మంది చనిపోయారట. ఇది ఏం వ్యాధో తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి