
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజైన సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్ లో అత్యధిక వసూళ్లు కూడా పఠాన్ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓపెనింగ్స్ దగ్గర నుంచి రోజువారీ వసూళ్ల వరకు పఠాన్ సినిమా కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పఠాన్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.313 కోట్లు వసూలు చేసినట్టు సినిమా అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
Read Also : వందేభారత్ రైలులో చెత్తాచెదారం.. నెటిజన్లు ఫైర్ –
భారత్ లో మూడో రోజు వసూళ్లు రూ.38 కోట్లు కాగా ఇప్పటి వరకు మొత్తం రూ.161 కోట్లు వసూలు చేసింది. తమిళ్, తెలుగు భాషల్లో కలిపి మరో రూ.5.75 కోట్లు రాబట్టింది. దీంతో హిందీలో వచ్చిన మూవీస్ లో పఠాన్ ఫాస్టెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు బ్రేక్ చేసింది. కేవలం భారత్ లోనే రూ. 201 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.313 కోట్లు రాబట్టినట్టు ట్వీట్ లో రాసుకొచ్చారు. షారుఖ్ ఖాన్ వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో కొంత విరామం తీసుకుని పఠాన్ సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించగా.. ముఖ్యమైన పాత్రలో జాన్ అబ్రహం నటించాడు.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
- ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి
- తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి