
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో చేర్మెన్ ఎలక్షన్స్ జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం మళ్ళీ మోదలయ్యింది. తుక్కుగూడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి 2020 వ.సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు జరుగగా అందులో 9 బీజేపీ 5 టీఆర్ఎస్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందగా బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో మున్సిపల్ చేర్మెన్ పదవి బీజేపీ దక్కేది. కానీ టీఆరెస్ పార్టీ 5 స్థానాలు గెలిచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన అభ్యర్థిని టీఆరెస్ లోకి తీసుకున్నారు దీనితో 6 మంది సభ్యులు అయ్యారు అయిన చేర్మెన్ పదవికి మెజారిటీ సరిపోదని ఎక్స్ అఫిషియో సభ్యులను ఐదుగురిని తీసుకున్నారు 1.మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 2.ఏగ్గె మల్లేషం, 3. నాయిని నర్సింహారెడ్డి, 4. కె కేశవరావు, 5. కాటే పల్లి జెనార్దన్ ఓట్లు వేయగా టి ఆర్ ఎస్ పార్టీకి మెజారిటీ రావడంతో చేర్మెన్ పదవి టి ఆర్ ఎస్ కైవసం చేసుకుంది.
Read Also : తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
ఇది ఇలా ఉండగా శుక్రవారం తుక్కుగూడలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు రచ్చ లక్ష్మణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020 లో జరిగిన తుక్కుగుడా మున్సిపల్ చేర్మెన్ ఎలక్షన్ లో ఎక్స్ అఫిషియో వేసిన ఓట్లు చెల్లవని, ఓట్లు వేసిన వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 27-01-2023 కి ఇప్పటికే 3 సంవత్సరం లు గడిచాయి హైకోర్టు ,జిల్లా కోర్ట్ తీర్పు ఎక్స్ అఫిషియో ఓట్లు చెల్లుబాటు కావని తీర్పు రావడం తో తుక్కుగుడా మున్సిపల్ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తుక్కుగుడా మున్సిపల్ లో మొత్తం 15 సీట్లకు గాను 9 బీజేపీ, 5 టి ఆర్ ఎస్, 1 ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అయితే చైర్మన్ పదవి బీజేపీ కి దక్కుతుందని టీఆర్ ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి లాక్కొని ఎక్స్ అఫిషియో మెంబర్స్ 1.మంత్రి సబితాఇంద్రా రెడ్డి 2. నాయిని నర్సింహారెడ్డి, 3.కె. కేశవరావు, 4.ఎగ్గే మల్లేశం, 5.కాటేపల్లి జనార్దన్ అక్రమంగా ఓట్లు వేసుకొని చైర్మన్ పదవి దక్కుంచుకున్నారని అన్నారు. అయితే అసలు ఈ ఎక్స్ అఫిషియో ఓట్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది, అడ్డగోలు దారిలో తుక్కుగూడ కు సంబంధం లేకుండా దొంగ దారిలో ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.
Also Read : కొడుకు భార్యను పెళ్లాడిన వృద్ధుడు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడన్గ్ పెట్ మున్సిపల్ లో ఓటు నమోదు చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అన్నారు. అక్కడ ఓటు నమోదు చేసుకొని ఇక్కడ ఎలా వేస్తారని మండిపడ్డారు. మంత్రి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ని అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకున్నారని తెలిపారు. ఈ ఎలక్షన్ పై కోర్ట్ కు వెళ్ళమని తీర్పు కూడా బీజేపీ కె అనుకూలంగా రావడం,ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా చెల్లవని తీర్పు వచ్చింది దీనితో మళ్ళీ అవిశ్వాసం పెట్టిన బీజేపీ పార్టీ నే చైర్మన్ పదవిని సొంతం చేసుకుంటుందని బీజేపీ నాయకులు అన్నారు. కలెక్టర్ తో ఈ విషయం చర్చించి ఎక్స్ అఫిషియో ఓట్లు వెంటనే తీసివేయలని అక్రమంగా వేసిన ఓట్లు చెల్లవని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కలెక్టర్ అఫిస్ ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. కానీ ఇప్పటికీ తుక్కుగూడ మున్సిపాలిటీ లో కో ఆప్షన్ మెంబర్ల ఎంపిక జరగలేదని బీజేపీ నాయకులు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గోరిగే దేవేందర్, కృష్ణ, ఎన్. బాల్ రాజ్, కటికల ఆంజనేయులు, దొంతరమోని రాజు, పల్లె జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తారకరత్నకు ఎక్మోపై వైద్యం… బెంగళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్
- కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం