
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీలో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా అనుమానితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారణకు పిలిపించింది. దీంతో హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న సీబీఐ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకే సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి తన లాయర్ ను కూడా విచారణకు అనుమతించాలని సీబీఐ అధికారుల్ని కోరారు. అయితే సీబీఐ అధికారులు అందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీబీఐ బృందం అవినాష్ ను విచారిస్తోంది.
Also Read : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు
ఇందులో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరోజు విచారణ సందర్భంగా అవినాష్ పై సీబీఐ అధికారులు రెండు కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ తో పాటు ఆయన ఆర్ధిక లావాదేవీల గురించి ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. లాయర్ లేకుండానే విచారణలో పాల్గొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు మన్నించారా లేదా అన్నది తేలలేదు. ఇవాళ అవినాష్ ను ఇప్పటికే రెండు గంటలకు పైగా విచారిస్తున్న అధికారులు.. ఇవాళ విచారణ పూర్తి కాకపోతే రేపు కూడా పిలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- జపాన్ లో వంద రోజులు ఆడిన తొలి భరతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు…
- కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
- కొడుకు భార్యను పెళ్లాడిన వృద్ధుడు
- బీజేవైఎం కార్యకర్తలపై పోలీసుల దాడి హేయమైన చర్య…. బండి సంజయ్
One Comment