
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచంలో ఎప్పుడూ జరగని.. ఎన్నడూ వినని, కనని ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం. వింతగా వాటి గురించి చెప్పుకుంటాం. ఇలా కూడా జరుగుతాయా అని అనుకుంటాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కొడుకు చనిపోతే కొడుకు భార్యను పెళ్లి చేసుకున్నాడు ఓ వృద్ధుడు. అతనికి 70ఏళ్లు.. కాగా ఆమెకు 28 ఏళ్లు. అంటే మామ .. కోడలిని పెళ్లి చేసుకున్న ఈ ఘటన గోరఖ్ పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగింది.
Read Also : కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు –
అతని పేరు కైలాశ్ యాదవ్. కైలాశ్ కు 12 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లై వేర్వేరుగా కాపురాలు పెట్టారు. కొన్నేళ్ల కిందట కైలాశ్ మూడో కొడుకు చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటిరిగా బతుకుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలె కైలాశ్ పూజను పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఆలయంలో ఈ వివాహం జరిగింది. స్వామి సన్నిధిలో కైలాశ్ పూజ నుదుటన సింధూరం దిద్దాడు. తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకున్నారు. అయితే ఇలా 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్ –
- బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
- నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం –